Denmark Telugu Association – Founder’s Message
ఆందరికీ నమస్కారం,
ఎక్కడో పుట్టి,ఎక్కడో పెరిగి,ఇక్కడ ఇలా తెలుగువాళ్ళందరం కలవడం నాకు చాల ఆనందంగా ఉన్నది. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు సాహితీ సమరాంగణ సార్వభౌములు “శ్రీ కృష్ణదేవరాయలు “, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు “పాశ్యాత్యులు“, తేట తెలుగు అన్నారు “కన్నడిగులు“, సుందర భాష అన్నారు “తమిళులు“. ఇలా చాలా మంది చాలవిధాలుగా తెలుగు భాషలోని గొప్పతనాన్ని,తెలుగువారిలోని ఔన్యత్యాన్ని చాలవిధాలుగా కీర్తించారు. ఎందరో మహానుభావులు తెలుగు భాషలోని మాధుర్యాన్ని తెలుగువారి యొక్క అభిమానాన్ని, అప్యాయతలని, సంప్రాదాయాలని వారి వ్యాసాలలో పొందుపరిచారు. ఆంతే కాదు మన యొక్క భాషలో, భావనలో శాస్త్రీయత అంతర్లీనమై ఉన్నది.
ఈ రోజులలో మనిషి తన జీవనం కోసం,తన అభివ్రుద్ది కోసం,ఎదుగుదల కోసం,విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం, ఈ ప్రపంచంలో ఉన్న దేశాలు అన్ని తిరుగుతున్నాడు.ఆఖరికి ఈ విషయంలో చంద్ర మండలంలో కుదా తన జీవనం సాగించేదానికి బీజం వేసాడు.ఇదే పద్దతిలో మన తెలుగువారు కూడా ప్రపంచంలో వివిద దేశాలో జీవనం సాగిస్తూ ఆ ఆ దేశాలలో స్తిరపడుతున్నారు.అక్కడ ఎంత స్తిరపడినా,మన తెలుగువాళ్ళు మన సంస్క్రుతిని ని మరచిపోకుండా, సంప్రదాయాలను గౌరవిస్తూ, వాటిని కాపాడడం కోసం, మన ఔన్యత్యాన్ని ఆయా దేశాలలో చాటి చెప్పడానికి అసోసియషన్లు స్తాపిస్థూ, వెనక వచ్హే తరానికి చేయూతని ఇవ్వగలగుతున్నారు.
మేము డెన్మార్క్ వచ్చిన కొత్తలో ఇక్కడ మనవాళ్ళకు సంభందించిన అసోసియషన్ ఎటువంటిది లేదు. మేము 2004లో మొట్టమొదటి ప్రయత్నంగా INDK (Indians in Denmark) గూగుల్ గ్రూపును స్తాపించటము జరిగింది. ఆది కొంత వరకు మా అందరికి సహాయపడినది. ఆ తరువత ఐండియన్ అసోసియషన్ ప్రారంభించారు. కాని ఎల్లప్పుడూ ఎక్కడో ఒక చిన్న వెలితి కనపడుతూ ఉండేది. ఆదే భాష ….ఈ భాష వల్ల సరి అయిన అవగాహన వచ్చేది కాదు.సమన్వయం లోపించేది. ఆప్పట్లో మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము.(ఉద్యోగాల పరంగా కావచ్చు, సమాచార లోపం కావచ్చు, సరి అయిన మార్గదర్సి లేకపొవటం కావచ్చు).
“మేము అందరం కలిసి కూర్చుని అనుకునేవాళ్ళము, మన తెలుగు పండుగలు ఇక్కడ చేస్తూ, తెలుగు సంస్క్రుతిని,సంప్రదాయలని మనం పాటిస్తూ ఇక్కద వాళ్ళకి మన తెలుగువారి ఔన్యత్యాన్ని చూపించాలి అని”,అలాగే, “మా లాగా మా ముందు తరంలో వచ్చేవాళ్ళకు ఎలాంటి అడ్డంకులు ఎదురుపడకుండా ఉండడానికి ఒక్క సమాచార కేంద్రంలాంటిది, మన తెలుగు వారికి ఉంటే బాగుండును అని”. ఆప్పుడే మొదలయింది డెన్మార్క్ లో నివసించే తెలుగువాల్ల కోసం ఒక అసొషియేషన్ అనే ఆలొచన. ఆ ఆలొచనకి కార్య రూపమే మన ఈ “డెన్మార్క్ తెలుగు అసొషియేషన్ (సంఘము)”. ఈ అసోషియేషన్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం డెన్మార్క్ లో నివసించు తెలుగువారిని అందరిని ఒక్క గొడుగు క్రిందకు తీసుకుని రావడమె. ఈ అసోషియేషన్ కొత్తగ వచ్చిన విద్యార్థులకుగాని మరియు ఇతర కారణాలవల్ల డెన్మార్క్ కి ఏతెంచిన వాళ్ళకు ఒక సమాచార కేంద్రము వలే ప్రయోజనం చేకూరుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకు, ఇక్కడ ఉంటున్న (నివసిస్తున్న)వాళ్ళకు, మన తెలుగు తనం మరచిపోకుండా ఉండడం కోసం ఈ అసోషియేషన్ బాగా ఉపయొగ పడుతుంది అని మా గట్టి నమ్మకం.
ఎన్నో రొజుల కష్టం, ఎంతో మంది శ్రమ… ఈ అసోషియేషన్ కి ఒక రూపం తెచిపెట్టిన్నది”మొదటి అడుగు ఎప్పుడూ ఒక్కడిదే … మొదటివాడు ఎప్పుడూ ఒంటరే…కానీ వెనుక వచ్చే వారికి ఆ అడుగు ఎప్పుడూ ఒక మంచి బాటగానే నిలుస్తుంది.కాబట్టి “మేము అందరము బాధ్యతగా మొదటి అడుగు వేశాము”.”మీరు ఒంటరి కారు, మేము మీకు తోడున్నాము అని, మీ అడుగులు కూడా మాతో కలిపి వెనక వచ్చే వాళ్ళకి ఒక మంచి బాట అవ్వాలని , ఈ అసోషియేషన్ని విజయవంతంగా ముందుకు నడిపించాలి అని మా యొక్క భావన,ఆకాంక్ష,తపన.”
మా ఆలోచనను మీ అందరితో పంచుకోవాలని, ఈ వెబ్ సైట్ ని మీ చెంతకు తెచ్చాము. ?
జై హింద్, జై తెలుగు తల్లి
అమర్ నాధ్ పొట్లూరి
డెన్మార్క్ తెలుగు సంఘము
Founding Board Members
